మంత్రి నారా లోకేష్ నెల్లూరు జిల్లా దగదర్తి పర్యటనకు హాజరయ్యేందుకు వచ్చి వెళ్తున్న టీడీపీ కార్యకర్తలు ప్రయాణిస్తున్న ఆటో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 10 మంది వరకు గాయపడ్డారు. తన పర్యటనకు వచ్చి తిరిగి వెళుతున్న కార్యకర్తల ఆటోను కారు ఢీకొన్న ప్రమాదంలో పలువురు గాయపడటం చాలా బాధాకరమని లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్ర ఆగ్రోస్ కార్పోరేషన్ ఛైర్మన్ దివంగత మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన మంత్రి నారా లోకేష్ టీడీపీ శ్రేణులు దారిపొడువున ఘన స్వాగతం పలికారు.

