ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కో-ఆర్డినేటర్లు పాల్గొన్న టెలికాన్ఫరెన్స్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తగిన గుర్తింపు తప్పకుండా ఉంటుందని హామీ ఇచ్చారు. పార్టీ కోసం నిస్వార్థంగా శ్రమించిన వారిని నిర్లక్ష్యం చేయబోమని స్పష్టం చేశారు. “నా దృష్టిలో కార్యకర్తలే పార్టీకి పునాది, వారిని గౌరవించడమే మా కర్తవ్యం” అని ఆయన పేర్కొన్నారు.

