నా ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధం. సీఎం చంద్రబాబు నాయుడు కు లేఖ రాయడానికి కూడా సిద్ధమే. నా దగ్గర వేల కోట్లు ఉన్నాయని నిరూపిస్తే..అమరావతికి విరాళంగా ఇచ్చేస్తా’అని మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. ‘నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు నా ఆస్తుల్లో రూపాయి పెరిగినా విచారణకు సిద్ధమే. సిట్టింగ్ జడ్జితో విచారణకు నేను సిద్దం’అని మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు.

