ధ్రువ్ రాఠీ.. యూట్యూబ్, సోషల్ మీడియాలో వివాదాస్పద అంశాలతో వీడియోలు చేస్తూ గుర్తింపు సంపాదించుకున్నాడు ఇప్పుడు ధ్రువ్ రాఠీపైనే సోషల్ మీడియాలో నెగెటివ్ ప్రచారం మొదలైంది. అది కూడా అతడి వ్యక్తిగత జీవితంపై. అతడు తన భార్య జూలీని మోసం చేశాడని పలు సోషల్ మీడియా అకౌంట్లలో కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. కొంతమంది తన ఇమేజ్ దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా ఈ ప్రచారం చేస్తున్నారని ధ్రువ్ రాఠీ విమర్శించాడు. ఇలా ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారాలు చేయకుండా, మరింత కష్టపడాలని సూచించాడు.

