జనగామ జిల్లా లింగాల ఘణపురం మండలం వనపర్తి గ్రామం ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులపై జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని కుందారం, వనపర్తి, నేల పోగుల గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ క్రమంలో వనపర్తి కొనుగోలు కేంద్రంలో ఏఈఓ శ్రీనివాస్ ఒక్కరే ఉండడం,మాలీలు రాకపోవడంతో, ఇలాగైతే రైతుల నుండి సకాలంలో ధాన్యాన్ని ఎలా కొనుగోలు చేస్తాం? కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎన్ని రోజులు పడిగాపులు కాయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు

