దేశ సైనిక సామర్థ్యం మరింత బలోపేతం కానుంది. లైట్ మెషిన్ గన్స్తోపాటు కార్బైన్లను ఇజ్రాయెల్ సరఫరా చేయనుంది. ప్రపంచంలోనే తొలి కంప్యూటరైజ్డ్ రైఫిల్ సిస్టమ్ ‘అర్బెల్ టెక్నాలజీ’ని త్వరలోనే మన సైన్యానికి ఇజ్రాయెల్ తయారీ లైట్ మెషిన్ గన్స్ అందనున్నాయి. మొదటి విడతలో 40వేల లైట్ మెషిన్ గన్స్ అందనున్నాయి. వచ్చే ఏడాది ఆరంభంలో వాటిని సరఫరా చేయనున్నట్లు రక్షణ పరికరాల సంస్థ ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. ఇప్పటికే వాటి పరీక్షలు పూర్తయ్యాయని ఉత్పత్తి కోసం లైసెన్స్ పొందినట్లు వెల్లడించింది.

