ప్రపంచ క్వాంటం దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ’ని అత్యాధునిక సదుపాయాలను మంగళవారం ప్రారంభించారు.ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏర్పాటు చేసిన ‘1ఎస్ ఓపెన్ యాక్సెస్ క్వాంటం ఫెసిలిటీ’ని ప్రారంభించారు. గన్నవరంలోని మేధా టవర్స్ ఇక్కడ ఉన్న ‘1క్యూ క్వాంటం ఫెసిలిటీ’ని జాతికి అంకితం చేశారు. ఈ రెండు కేంద్రాలు క్వాంటం కంప్యూటింగ్ ఉపకరణాలను పరీక్షించే టెస్ట్ బెడ్స్‌గా పనిచేస్తాయి. ఈ కొత్త సదుపాయాల వల్ల క్వాంటం కంప్యూటర్ హార్డ్‌వేర్‌ను పరీక్షించి, సర్టిఫై చేసే విశిష్ట సామర్థ్యం లభించింది.

