71వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా, ఏడు కేటగిరీల్లో తెలుగు సినిమాకు అవార్డులు వరించాయి మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియాలో జాతీయ అవార్డ్ గ్రహీతలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ చేశారు. “తెలుగు టాలెంట్, తెలుగు సినిమాలు ఈసారి పదికి పైగా విభాగాల్లో అవార్డులు గెలుచుకోవడం చూసి ఎంతో గర్వంగా ఉంది.. ” అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు చిరంజీవి.అలానే బాలయ్య నటించిన భగవంత్ కేసరి చిత్ర బృందానికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.

