తిరుపతి నేషనల్ సాంస్కృతిక యూనివర్సిటీలో ఒడిశాకు చెందిన ఓ యువతి ఫస్టియర్ చదువుతోంది. ఆమెపై అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్‌కుమార్ కన్నేశాడు. ఆమెను లైంగికంగా వేధించిన ప్రొఫెసర్.. కొంతకాలం మాయమాటలు చెప్పి లోబరచుకున్నాడు. ఈ క్రమంలోనే సదరు విద్యార్థి గర్భం కూడా దాల్చింది. కాగా, ఇటీవల ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ వేధింపులు ఎక్కువ కావడంతో తట్టుకోలేకపోయిన విద్యార్థిని.. వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తికి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు చర్యలకు ఉపక్రమించిన వీసీ.. ప్రొఫెసర్ లక్ష్మణ్‌కుమార్‌ను సస్పెండ్ చేశారు.