తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ, రాష్ట్ర రాజకీయాల్లో భారీ అంచనాలు నెలకొన్న తమిళనాడు వెట్రి కళగం (TVK) పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు గుర్తును కేటాయించింది. డీఎంకే ఉదయసూర్యుడు , అన్నాడీఎంకే రెండాకుల గుర్తులకు ధీటుగా, విజయ్ సారథ్యంలోని టీవీకేకు విజిల్ గుర్తు లభించింది. తమ పార్టీ కోరిన టాప్-10 ప్రాధాన్యతల్లో విజిల్ గుర్తు మొదటి స్థానంలో ఉందని, దీనివల్ల కేడర్‌లో కొత్త ఉత్సాహం నెలకొందని పార్టీ ముఖ్య నేత నిర్మల్ కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు.

