డ్యాన్స్ షోలు, సినిమాల్లో కొరియోగ్రాఫర్‌గా పేరుతెచ్చుకున్న ఢీ కొరియోగ్రాఫర్ కృష్ణ మైనర్ బాలికపై అసభ్య ప్రవర్తనకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆయనపై పోక్సో (POCSO) కేసు నమోదు కాగా, గచ్చిబౌలి పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీస్ స్టేషన్‌కి వచ్చిన బాలిక తల్లిదండ్రులు, కృష్ణ మాస్టర్ తన కుమార్తె పట్ల అనుచితంగా ప్రవర్తించాడని తీవ్ర ఆరోపణలు చేశారు. కృష్ణ మాస్టర్ పైన గతంలోనూ అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ వేదికగా పలు యువతులను మోసం చేశారన్న వార్తలు కూడా బయటపడుతున్నాయి.

