ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన వ్యక్తిత్వ హక్కుల రక్షణ కోసం కీలక అడుగు వేశారు. తన అనుమతి లేకుండా తన పేరు, ఫోటోలు, వీడియోలు, సంతకం లేదా వాయిస్‌ను వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించకుండా నిషేధం విధించాలని కోరుతూ ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అల్లు అర్జున్ క్రేజ్‌ను వాడుకుని సోషల్ మీడియాలో డీప్ ఫేక్ వీడియోలు సృష్టించడం, ఏఐ (AI) వాయిస్‌తో యాడ్స్ చేయడం వంటివి పెరిగిపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

