న్యూఢిల్లీ నుండి లండన్ కు వెళ్తున్న వర్జిన్ అట్లాంటిక్ నడుపుతున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. న్యూఢిల్లీ నుండి నేరుగా లండన్‌కు ప్రయాణీకులను తీసుకెళ్లాల్సిన VS301 విమానం మధ్యలో ఇబ్బందులను ఎదుర్కొంది. టర్కీలోని ఇస్తాంబుల్ లో సాంకేతిక సమస్య తలెత్తడంతో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. లండన్ లోని హీత్రూ విమానాశ్రయానికి వెళ్తున్న విమానంలో విమానం వ్యవస్థలో సమస్య ఉందని ఎయిర్ లైన్స్ గుర్తించిన తర్వాత ఇస్తాంబుల్ విమానాశ్రయంలో ల్యాండ్ చేయాల్సి వచ్చిందని విమానయాన సంస్థ వెల్లడించింది.

