ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన భారీ పేలుడు ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్షా వేగంగా స్పందించారు. ఎన్ఎస్జీ, ఎన్ఐఏ టీమ్లు, ఎఫ్ఎస్ఎల్ టీమ్లు కూలంకషంగా దర్యాప్తు జరుపుతున్నాయి. సమీపంలోని అన్ని సీసీటీవీ కెమెరాలు పరిశీలించాలని ఆదేశాలిచ్చాం. ఢిల్లీ సీపీ, స్పెషల్ బ్రాంచ్ ఇన్చార్జితో మాట్లాడాను. వారిరువురూ ఘటనా స్థలి వద్ద ఉన్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని సమగ్ర విచారణ జరుపుతాం. ఆ వివారాలను పబ్లిక్కు తెలియజేస్తాం. ఆసుపత్రికి స్యయంగా వెళ్లి క్షతగాత్రుల పరిస్థితిని తెలుసుకుంటాను’ అని అమిత్షా తెలిపారు.

