జీవం ఉనికికి కారణమైన జన్యు పదార్థం డీఎన్ఏ నిర్మాణాన్ని కనుగొన్న అమెరికన్ శాస్త్రవేత్త జేమ్స్ డీ వాట్సన్ శుక్రవారం తుది శ్వాస విడిచారు. వృద్ధాప్య సంబంధిత సమస్యలతో 97 వయసులో కన్నుమూశారు.మెలికలు తిరిగిన నిచ్చెన ఆకారంలో ఉన్న డీఎన్ఏ నిర్మాణాన్ని డబుల్ హెలికల్ స్ట్రక్చర్ అని పిలుస్తారు ఈ అమరికను కనుగొన్నందుకు బ్రిటన్ శాస్త్రవేత్త ఫ్రాంసిస్ క్రిక్, మారిస్ విల్కిన్స్లతో కలిసి జేమ్స్ డీ వాట్సాన్ 1962లో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందారు

