అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రెజిల్‌పై సుంకాలు విధిస్తానని హెచ్చరించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడైనా మీరు నాక్ ఫోన్ చేయొచ్చంటూ ఆ దేశ అధ్యక్షుడికి ఆఫర్ కూడా ఇచ్చారు. ట్రంప్ తనతో మాట్లాడటానికి ఇష్టపడటం లేదని, అందుకే నేను ఆయనకు ఫోన్ చేయనని లులా స్పష్టం చేశారు. బ్రిక్స్ భాగస్వాములైన భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లకు ఫోన్ చేసి.. వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకుంటానని తేల్చి చెప్పారు.

