అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ ‘ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ డిప్యూటీ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన పది నెలల లోపే డాన్ బోంగినో (51) తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా విధానపరమైన నిర్ణయాల్లో అటార్నీ జనరల్ పామ్ బాండీతో బోంగినోకు మధ్య సఖ్యత లేకపోవడమే ఈ ఆకస్మిక రాజీనామాకు దారితీసిందని కథనాలు వస్తున్నాయి న్యూయార్క్ పోలీస్ ఆఫీసర్‌గా, సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌గా పని చేసిన అనుభవం ఉన్నప్పటికీ.. ఆయన ఒక రాజకీయ విశ్లేషకుడిగా, పాడ్‌కాస్టర్‌గా ఎక్కువ గుర్తింపు పొందారు.

