లండన్ లో ఘోర ప్రమాదం సంభవించింది. సౌత్ఎండ్ విమానాశ్రయం నుంచి బయల్దేరిన ఓ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్పోర్ట్ సమీపంలో కుప్పకూలిపోయింది నెదర్లాండ్స్‌కు చెందిన ఓ ఏవియేషన్ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న చిన్న విమానం ఆదివారం మధ్యాహ్నం సౌత్ ఎండ్ ఎయిర్పోర్ట్ నుంచి గాల్లోకి ఎగిరింది. టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే విమానం ఒక్కసారిగా కూలిపోయింది. పెద్దశబ్దంతో మంటలు వ్యాపించాయి. అనంతరం నల్లటి పొగ ఎగసిపడింది.

