మంత్రి నారా లోకేశ్ టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటరీ కమిటీలకు శిక్షణ తరగతులు ప్రారంభించారు. పార్టీ కార్యాలయానికి వచ్చిన కమిటీలను స్వయంగా ఆహ్వానించిన లోకేశ్, ఎన్టీఆర్ ప్రతిమకు నివాళులర్పించారు. శిక్షణ తరగతులకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు హాజరయ్యారు. పార్టీ అంటే కమిట్మెంట్ ఉన్నవాళ్లకే కమిటీల్లో బాధ్యతలు అప్పగించామని, 83 శాతం మంది కొత్త వారికి పార్లమెంట్ కమిటీల్లో తొలిసారి చోటు కల్పించినట్లు మంత్రి లోకేశ్ తెలిపారు.

