ఉత్తరప్రదేశ్ సిద్ధార్థ నగర్ లోని ఒక గ్రామంలో ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ నీటి ట్యాంక్ పైకి ఎక్కారు. దిగడానికి ప్రయత్నించగా ట్యాంక్ కు ఉన్న ఇనుప నిచ్చెన ఒక్కసారిగా విరిగిపోయింది. దీంతో దిక్కుతోచని స్థితిలో ఆ చిన్నారులు ట్యాంక్ పైనే చిక్కుకుపోయారు. రాష్ట్ర ప్రభుత్వ వాయుసేన సాయం కోరింది. గాలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ వాయుసేన పైలట్లు ఎంఐ 17 వి5 హెలికాప్టర్ ను ట్యాంక్ కు అతి సమీపంలో స్థిరంగా ఉంచారు.
సిబ్బంది తాడు సహాయంతో కిందకు దిగి చిన్నారులను సురక్షితంగా రక్షించారు.

