loader

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిమెంట్‌ లారీని వెనుకవైపు నుంచి వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందారు. బెంగళూరు నుంచి చిత్తూరు వైపు వస్తున్న కారు లారీని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటన గంగవరం మండలం వైఎస్సార్‌ జంక్షన్ వద్ద చోటుచేసుకుంది. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. మృతులు కర్ణాటకకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. కారు ఓవర్ స్పీడ్‌లో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్ల లారీ కిందకు దూసుకెళ్లినట్లు తెలుస్తోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON