బీజేపీ, ఆర్ఎస్ఎస్లపై కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జన సమీకరణల పేరుతో సమాజాన్ని విషపూరితం చేస్తున్నారని, మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వంటి ప్రముఖులకు ఎదురైన చారిత్రక చేదు అనుభవాలే ఇందుకు నిదర్శనమని అన్నారు. ప్రభుత్వ ప్రాంగణాల్లో ఇక నుంచి ఎలాంటి సమావేశాలను నిర్వహించ రాదని కర్ణాటక మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ‘ఆర్ఎస్ఎస్, బీజేపీల స్థాయీ ఆపరేషన్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) ఆలోచన.. అత్యంత విషపూరితం చేసే ఆలోచన అని అన్నారు.

