అమెరికా రాజకీయాల్లో మరోసారి భారత సంతతి ప్రతిభ దూసుకుపోయింది. ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో డెమోక్రాట్లు భారీ విజయాన్ని సాధించగా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది భారతీయ మూలాల అభ్యర్థుల గెలుపు.
న్యూయార్క్లో 34 ఏళ్ల జోహ్రాన్ మమ్దానీ మేయర్గా ఎన్నికై చరిత్ర సృష్టించారు. వర్జీనియాలో గజాలా హష్మీ లెఫ్టినెంట్ గవర్నర్గా, వర్జీనియా హౌస్ ఆఫ్ డెలిగేట్స్లో జెజె సింగ్ కూడా గెలిచి భారత సంతతికి మరో గౌరవాన్ని తీసుకువచ్చారు.

