నందమూరి బాలకృష్ణ అకౌంట్లో ఈ సంవత్సరం మరో అరుదైన పురస్కారం చేరింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మ భూషణ్ పురస్కారాన్ని అందుకున్న నందమూరి బాలకృష్ణ.. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ‘ఎన్టీఆర్ నేషనల్ అవార్డు’కు ఎంపికయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఫస్ట్ టైమ్ ఇస్తున్న గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఎన్టీఆర్ జాతీయ అవార్డ్‌ను అందుకున్న మొదటి వ్యక్తిగానూ బాలయ్య చరిత్ర సృష్టించబోతున్నారు.

