తెలంగాణ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ, “కేసీఆర్ ఒక కారణజన్ముడు. ఆయన జీవితమే ఒక చరిత్ర. త్వరలోనే ఆయన్ని కేంద్రంగా చేసుకొని నేను కూడా ఒక పుస్తకం రాస్తాను” అని వెల్లడించారు. తాజాగా తెలంగాణ భవన్‌లో ‘ప్రజాయోధుడు’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. మహేంద్ర తోటకూరి రచించిన ఈ పుస్తకం పూర్తిగా కేసీఆర్ జీవితానికి అంకితమైంది “ఈ పుస్తకం చాలా బాగుంది, చదివిన ప్రతి ఒక్కరికీ కేసీఆర్ జీవితం ఒక ప్రేరణగా నిలుస్తుంది” అని ఆయన ప్రశంసించారు.

