మాజీ సిఎం కెసిఆర్ కెసిఆర్ పార్టీకే మనుగడ లేదని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బిఆర్ఎస్ పార్టీకి గతం ఉందని.. భవిష్యత్ లేదని అన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో సిఎం చిట్ చాట్ చేశారు. కొత్త పార్టీ సంగతి తరువాత.. ఉన్న పార్టీ ఉంటుందా.. ఊడుతుందా? అని ప్రశ్నించారు. కెసిఆర్ కుటుంబ సభ్యులు తెచ్చి పెట్టుకున్న నటన చేస్తున్నారని విమర్శించారు. కెసిఆర్ కుటుంబంమంతా ఒక్కటేనని..రంగు రుచి లేదని, కెసిఆర్ చనిపోతే తనకేం వస్తుందని, కెసిఆర్ చావు తాను ఎందుకు కోరుకుంటానని రేవంత్ ప్రశ్నించారు.

