కెనడాలో ఓ భారత సంతతి వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కర్ణాటకు చెందిన చందన్‌కుమార్ అనే వ్యక్తి కాల్పులకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. టొరొంటోలో శనివారం ఈ ఘటన జరిగింది. రెక్స్‌డేల్ బోలీవార్డ్లో వుడ్బైన్ షాపింగ్ సెంటర్ పార్కింగ్ స్థలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చందన్ కుమార్ బ్రాంప్టన్ ప్రాంతంలో నివసించేవాడని పోలీసులు తెలిపారు. అతడి కారు వద్దనే కాల్పులకు గురయ్యాడని తెలిపారు

