బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌ను ఫోన్ ట్యాప్ చేసినందుకు పిలిచారా? లేక కెటిఆర్ ఫోన్ ట్యాప్ అయినందుకు పిలిచారా? అని ప్రభుత్వాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు సిరిసిల్ల కేంద్రంగా సాగిందని, ఫోన్ ట్యాపింగ్ ద్వారా వేల కోట్ల రూపాయల దందా సాగిందని ఆరోపణలు చేశారు. సినిమా హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసి ఎలా లబ్ధిపొందారా తనకు తెలుసుననన్నారు. అన్ని కేసుల్లో సిట్ విచారణలకు ముగింపు ఉంటుందని, ఫోన్ ట్యాపింగ్‌లో మాత్ర సీరియల్లా ముగింపు లేదని ఎద్దేవా చేశారు

