ఆర్జేడీ అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన భార్య రబ్రీదేవి, కుమారుడు తేజస్వి యాదవ్, కోడలు రాజ్శ్రీ యాదవ్,
కుమార్తె మీసా భారతితో కలిసి పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేశారు. తేజస్వి యాదవ్ మాట్లాడుతూ.. మహాగఠ్బంధన్ ఘన విజయం సాధించబోతున్నదని ధీమా వ్యక్తంచేశారు. బీహార్లో మార్పు కోసం ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు.

