కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి పెద్ద ఎత్తున జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ నివేదిక ఆధారంగా ఎలాంటి తొందరపాటు చర్యలు వద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన సంగతి తలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విచారణ కోసం న్యాయ నిపుణుల సూచనల మేరకు తక్షణమే విచారణ చేపట్టాలని కోరుతూ సీబీఐకి లేఖ రాయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అదేశించారు.
అవసరమైతే ఈ విషయంలో సీబీఐ డైరెక్టర్ అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా వినతిపత్రం అందించాలని మంత్రులకు సూచించారు

