ప్రముఖ సినీనటి బి. సరోజాదేవి మృతిపై సీఎంఓ విడుదల చేసిన కన్నడ సంతాప సందేశాన్ని, మెటా ఫేస్‌బుక్ ఆంగ్లంలో తప్పుగా అనువదించడమే. ఆ అనువాదం సరిగ్గా కాకపోవడంతో సీఎం తీవ్రంగా స్పందించారు. ఈ వివాదానికి సంబంధించి తాజాగా మెటా ప్రతినిధులు స్పందించారు. అనువాదంలో ఏఐ టూల్ మిషన్ తప్పిదం వల్ల ఇలా జరిగిందని సంస్థ ఫేస్‌బుక్‌లో పేర్కొంది. కచ్చితమైన అనువాదాన్ని అందించేందుకు కృషి చేస్తామని తెలిపింది. ఏఐ సాంకేతికతను మెరుగుపరచుకునే ప్రాసెస్‌లో ఉన్నామని, ఇందులో భాగంగానే తప్పిదం జరిగిందని మెటా వివరించింది.

