పాకిస్తాన్లోని కరాచీలోని ఒక షాపింగ్ మాల్లో శనివారం రాత్రి (జనవరి 17, 2026) భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటివరకు ఆరుగురు మరణించారు. వారిలో ఒక అగ్నిమాపక సిబ్బంది కూడా ఉన్నారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన జరిగి 12 గంటలకు పైగా గడిచినా, కొంతమంది ఇప్పటికీ భవనంలో చిక్కుకున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు వారిని రక్షించడానికి అగ్నిమాపక శాఖ సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారని వెల్లడించారు.

