ఒమన్‌లో రెండో రోజు భారతీయులతో ప్రధాని మోడీ పరీక్షా పే చర్చ జరిపారు. స్కూల్ విద్యార్థులతో ప్రధాని ముచ్చటించారు. వికసిత్ భారత్‌లో కొత్త ఎడ్యుకేషన్ పాలసీది కీలక భూమిక పోషిస్తుందని, ఒమన్‌లో తాను ఒక మినీ ఇండియాను చూస్తున్నానని ప్రశంసించారు. మాండవి నుంచి మస్కట్ వరకు వ్యాపించి ఉన్న అరేబియా మహా సముద్రంలో రెండు దేశాల సంస్కృతులను, ఆర్థిక వ్యవస్థలను కలిపే ఒక బలమైన వారిధి ఏర్పాటు చేశామన్నారు.

