మొంథా తుఫాన్‌పై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు పునరావాస కేంద్రాలకు ప్రత్యేకంగా ఇన్‌చార్జ్‌లను నియమించాలి అని ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో ఒక్కో కుటుంబానికి రూ.3,000 చొప్పున నగదు, అలాగే 25 కేజీల బియ్యంతో సహా నిత్యావసరాల పంపిణీ చేయాలని, ‘తాగునీటి సమస్య తలెత్తకుండా, ఎక్కడా కలుషితం కాకుండా చూసుకోవాలి.ఎక్కడా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించకుండా అధికారులు బాధ్యత తీసుకోవాలి. జిల్లాల్లో తుఫాను రక్షణ చర్యలను పర్యవేక్షించాల్సిన బాధ్యత కలెక్టర్లదే’అని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

