ప్రముఖ పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ ఐ-ప్యాక్ సహ వ్యవస్థాపకుడు వినేష్ చందేల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. పశ్చిమ బెంగాల్ బొగ్గు అక్రమ రవాణా కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ కేసును ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఈడీ పలు చోట్ల సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ టీఎంసీ కోసం పనిచేస్తున్న ఐ ప్యాక్ సంస్థకు చెందిన కీలక వ్యక్తిని ఈడీ అరెస్ట్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది

