బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు పట్ల ఏబీఎన్ ఛానెల్ ప్రతినిధి వెంకటకృష్ణ వ్యవహరించిన తీరుకు నిరసనగా.. ఇకపై అన్ని రకాల బీఆర్ఎస్ పార్టీ సమావేశాలకు ఏబీఎన్ ఛానల్ ప్రతినిధులను అనుమతించకూడదని అధిష్ఠానం నిర్ణయించింది. అలాగే ఏబీఎన్ టీవీ చానల్ చర్చలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొనరాదని తెలిపింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు.

