ఏపీలో పలువురు మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం విజయవాడ మున్సిపల్ కమిషనరేట్లో జోనల్ కమిషనర్ రమ్య కీర్తనను నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ గా నియమించింది. దర్శి మున్సిపల్ కమిషనర్ గా అర్జునరావు, పులివెందుల మున్సిపల్ కమిషనర్ గా మునికుమార్, ఉయ్యూరు మున్సిపల్ కమిషనర్ గా సుభాష్ చంద్రబోస్, తెనాలి మున్సిపాలిటీ అసిస్టెంట్ కమిషనర్ గా రామారావు, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ సౌత్ జోనల్ కమిషనర్గా ప్రసాదరావు, గుంటూరు మున్సిపాలిటీ అడిషనల్ కమిషనర్ గా మల్లయ్య నాయుడు నియమితులయ్యారు.

