ఏపీలో లే అవుట్ల క్రమబద్దీకరణ విషయంలో ప్రభుత్వం మరోసారి అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నా ఇంకా ఆమోదించకపోవడంపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యయంలో .. దరఖాస్తుదారులకు ఇబ్బంది లేకుండా వెంటనే పెండింగ్ అప్లికేషన్లు క్లియర్ చేయాలని మంత్రి నారాయణ ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటికే చేపట్టిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ప్రక్రియను పలుమార్లు పొడిగించారు. తద్వారా రాష్ట్రంలో అనధికారిక లేఅవుట్లు లేకుండా చేయడంతో పాటు ప్రభుత్వ ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా కనిపిస్తోంది.

