ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబుతో ఆదివారం సాయంత్రం టాలీవుడ్ పెద్దల సమావేశం ఖరారు అయింది. ఫిల్మ్ ఇండస్ట్రీ సమస్యల గురించి చర్చించేందుకు ప్రభుత్వ అధికారులు లేదా ముఖ్యమంత్రుల కలిసే సమయంలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి లిస్టు ఎంపిక చేయడం ఆనవాయితీ. కానీ ఈసారి మాత్రం ఛాంబర్ ఎంపిక చేసిన లిస్ట్ కాకుండా, నందమూరి బాలకృష్ణను, పవన్ కళ్యాణ్‌ను సంప్రదించి లిస్ట్ ఎంపిక చేసినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్.

