ప్రముఖ అంతర్జాతీయ టెక్ సంస్థ ఒరాకిల్ (Oracle) తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. మొత్తం 30 వేల ఉద్యోగులను తొలగించే ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విప్లవానికి అనుగుణంగా సంస్థలో సమూల మార్పులు చేసేందుకు యాజమాన్యం ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా వేలాది మంది ఉద్యోగులను తొలగించే (Layoffs) దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. కంపెనీ చరిత్రలోనే ఇది అత్యంత భారీ పునర్వ్యవస్థీకరణ కావచ్చని టెక్ నిపుణులు భావిస్తున్నారు.

