ఆదిలాబాద్‌కు ఎర్రబస్సే కాదు ఎయిర్ బస్సును కూడా తీసుకువస్తాం అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలోని వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇఛ్చారు. ఆదిలాబాద్ పట్టణంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడుతూ.. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు, చనాక – కొరాట ప్రాజెక్టు, విమానాశ్రయం, విశ్వవిద్యాలయం ఏర్పాటు, సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం వంటి కీలకమైన ప్రాజెక్టులపై స్పష్టమైన ప్రకటన చేశారు.

