ఈ క్రమంలో విద్యుత్ శాఖ అధికారుల్లో చలనం వచ్చినట్లు కనిపిస్తుంది. రామాంతాపూర్, పాతబస్తీ బండ్లగూడలో జరిగిన విద్యుత్ ప్రమాదాలపై విద్యుత్ శాఖ అధికారులు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. భారీ వర్షాల నేపథ్యంలో ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాల వద్దకు వెళ్ల వద్దని విద్యుత్ శాఖ అధికారులు ప్రజలకు సూచించారు. అంతేకాకుండా జీహెచ్ఎంసీ పరిధిలోని వివిధ డివిజన్లలో కరెంటు స్తంభాలకు ప్రమాదకరంగా వేలాడుతున్న కేబుళ్లను అధికారులు తొలగించే పనిలో పడ్డారు. ఇలా ఉప్పల్, రామాంతాపూర్, చిలకానగర్లలో విద్యుత్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

