టెక్సాస్‌లో ఇస్లాం మతాన్ని లేకుండా చేస్తానంటూ.. ఖురాన్‌ను తగులబెట్టి అమెరికా రాజకీయ నాయకురాలు వాలెంటినా గోమెజ్ సంచలనం సృష్టించారు. ముస్లింలు క్రైస్తవుల కుమార్తెలపై అత్యాచారం చేస్తారని, వారి కుమారులను చంపుతారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఒక క్రైస్తవ దేశమని.. అక్కడ ఉన్న ముస్లింలు ఇతర దేశాలకు వెళ్లిపోవాలని సూచించారు. ఇప్పుడే కాదు ఆమె గతంలోనూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు, చర్యలకు పాల్పడ్డారు.

