పాకిస్థాన్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పీటీఐ(పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్ రాజకీయాల్లోకి అధికారికంగా అడుగుపెడుతూ, పాకిస్తాన్ రిపబ్లిక్ పార్టీ అనే తన సొంత రాజకీయ పార్టీని ప్రారంభించినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా విదుడల చేసిన ప్రకటనలో.. ఆమె ఇలా ప్రస్తావించింది.. ఇది కేవలం ఒక పార్టీ కాదు, రాజకీయాలను సేవగా మార్చడానికి చేపట్టిన ఉద్యమం అని చెప్పుకొచ్చారు. తన పార్టీ ప్రజల గొంతుకగా పనిచేస్తుందని, పాలక వర్గాలను జవాబుదారీగా ఉంచుతుందని ఖాన్ అన్నారు.

