పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి, పీటీఐ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీలకు తోషాఖానా-2 కేసులో భారీ శిక్ష పడింది. ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) ప్రత్యేక కోర్టు శనివారం వీరిద్దరికీ 17 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. తోషాఖానా-2 కేసు ప్రభుత్వ బహుమతులకు సంబంధించినది. ఇమ్రాన్ ఖాన్, బుష్రా బీబీలు నిబంధనలకు విరుద్ధంగా ఒక ఖరీదైన బుల్గారీ జ్యువెలరీ సెట్‌ను చాలా తక్కువ ధరకు కొనుగోలు చేశారని, దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని ఆరోపణలు ఉన్నాయి.

