మహారాష్ట్రలోని పుణేలో ఆదివారం మధ్యాహ్నం పెద్ద ప్రమాదం జరిగింది. ఇంద్రాయని నదిపై నిర్మించిన వంతెన సగం కూలిపోయింది. వంతెన కూలిన సమయంలో చాలా మంది దాని మీద ఉన్నారు. దాంతో దాదాపు 25 నుంచి 30 మంది నదిలో పడి కొట్టుకుపోయారని స్థానికులు చెబుతున్నారు. పుణేలోని మావల్ లోని కుండ మాల్ లో ఇనుప వంతెన కూలిపోవడంతో కొంతమంది పర్యాటకులు నీటిలో పడి ప్రవాహంలో కొట్టుకుపోయారు.

