ఆసియా కప్ సెప్టెంబర్ 9 నుండి యూఏఈలో ప్రారంభమవుతుంది. బీసీసీఐ నిర్వహించే ఈ టోర్నమెంట్‌లో 8 జట్లు పాల్గొంటున్నాయి. టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుండి ప్రారంభమైనప్పటికీ.. ఈ లీగ్‌లోని హై-వోల్టేజ్ యుద్ధం సెప్టెంబర్ 14న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్ – పాకిస్తాన్ మధ్య జరుగుతుంది. కానీ ఈ టోర్నమెంట్‌లో టీమిండియా పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడుతుందా అనేది పెద్ద ప్రశ్న? ఆసియా కప్‌లో ఆడాలని నిర్ణయం తీసుకున్నప్పుడు.. ప్రభుత్వ అనుమతి ముందుగానే తీసుకుంటారని.. మ్యాచ్ జరిగే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

