బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీ వర్గంపట్ల వివక్ష కొనసాగుతూనే ఉన్నది. అవామీ లీగ్‌కు చెందిన మాజీ నాయకుడు 18 నెలలుగా జైల్లోనే మగ్గుతూ ప్రాణాలు కోల్పోయాడు. అవామీ లీగ్ మాజీ నేత, 86 ఏళ్ల రమేషన్ చంద్ర సేన్ విద్యావేత్త. బంగ్లాదేశ్ ఎంపీగా, మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వహంచారు. ఏ తప్పూ చేయకున్నా గడిచిన 18 నెలలుగా ఆయన జైల్లో మగ్గుతున్నారు. తన ఆరోగ్యం క్షీణిస్తున్నదని పలుమార్లు కోర్టుకు వెల్లడించినా బెయిల్ మాత్రం రాలేదు. దాంతో ఆయన జైల్లోనే ఆరోగ్యం మరింత విషమించి ప్రాణాలు కోల్పోయారు.

