తల్లి, భార్యను చంపేసి రైలు కిందపడి మోహన్ ,ఇద్దరు పిల్లలుకూడా ప్రాణాలు కోల్పోయారు. మోహన్ ఆన్‌లైన్ రమ్మీ ఆడి దానికి బానిసగా మారాడు.. అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్న ఆస్తుల్ని అమ్మేశాడు.. బంగారాన్ని తాకట్టు, రూ.40 లక్షల చీటీలు కూడా అప్పులు తీరకపోవడంతో కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరిగినట్లు సమాచారం. మోహన్ తండ్రి రైల్వేలో పనిచేస్తూ చనిపోయారు.. ఆయన ఉద్యోగం మోహన్‌కు వచ్చినా మానేశాడు. మోహన్ భార్య హరిత బ్యూటీపార్లర్, టైలరింగ్ ద్వారా సంపాదించిన డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తున్నారు.

