చైనా షాంగ్జీ ప్రావిన్స్‌లో ఈనెల 25న భారీ వర్షాలు కురిశాయి ఆ ప్రాంతంలో ఓ బంగారు ఆభరణాల దుకాణాన్ని వరద ఒక్కసారిగా పోటెత్తింది. కొట్టుకుపోయిన వాటిలో హారాలు, ఉంగరాలు, గాజులు, చెవి కమ్మలు, వజ్రాల ఉంగరాలు, కొన్ని వెండి వస్తువులు దాదాపు 20 కేజీల బంగారం కొట్టుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వాటి విలువ రూ.12 కోట్లకు పైమాటే అని వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు కొట్టుకుపోయిన బంగారం వెతికేందుకు ఎగబడ్డారు. వీధుల్లో బురద నీటిలో అనువణువూ వెతకడం ప్రారంభించారు.

